Telangana: పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుడి బర్త్‌డే వేడుకలు !

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చాలా ఆగడాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు అయితే… దారుణంగా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా లోనే వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులపై కక్షపూరిత రాజకీయాలు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగానే పోలీసులు వింటున్నట్లు… గులాబీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది.

The police cut the birthday cake of the Congress party leader at the police station

పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుడి బర్త్డే వేడుకలు నిర్వహించారు పోలీసులు. కేక్ కట్ చేసి మరి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన ఆందోల్ నియోజకవర్గం లో చోటుచేసుకుంది. ఆందోళన నియోజకవర్గం వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రమేష్ జోషి పుట్టిన రోజు సందర్భంగా… స్థానిక పోలీస్ స్టేషన్లో వేడుకలు నిర్వహించారు. అక్కడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు అందరూ కేక్ కట్ చేసి మరి రమేష్ జోసికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై చర్యలు తీసుకోవాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version