తెలంగాణలో పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పీడ్ పెంచాయి పోలీస్ శాఖ, విద్యాశాఖ. పేపర్ లీకేజి వాస్తవం కాదని.. కేవలం ఇన్విజిలేటర్ ఫోటోలు తీసి కావాలని మీడియా గ్రూప్ లో పోస్ట్ చేసి డిలీట్ చేశారని అంటున్నారు అధికారులు. ఆ తరువాత ఒక ప్రైవేట్ స్కూల్ సైన్స్ టీచర్ కి ప్రశ్నాపత్రాన్ని పంపారు నిందితుడు. ఆ పేపర్ ని అవగాహన చేసుకుని చిట్టిలు తయ్యారు చేసేందుకు 11.45 గంటల సమయం పట్టింది.
పరీక్ష 12.30 గంటలకు ముగుస్తుండటంతో ఏమి చెయ్యాలో తోచక ఎవ్వరికీ పంపలేకపోయాడు. ఇందులో రాజకీయ కోణం ఉన్నట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బందెప్ప ఉద్దేశపూర్వకంగా ఫోటోలు తీసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ముగ్గురిపై వేటు వేశారు విద్యాశాఖ అధికారులు. ఈ పేపర్ లీకేజ్ ఘటనపై మరికాసేపట్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన స్పష్టత ఇవ్వనున్నారు.