కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మొదలు కావడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటి వలన కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి, అదే విధంగా మరికొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అర్జెంటు గా కొనుగోలు చేసే మెడిసిన్ లిస్ట్ లో మొత్తం 870 రకాలు ఉండగా , వాటిలో 651 రకాల మందులపై కేంద్ర ప్రభుత్వం సీలింగ్ ధరను డిసైడ్ చేసింది. తద్వారా 651 రకాల మందుల ధరలు తగ్గాయి. తగ్గిన శాతం ఎంత అన్నది చూస్తే 6.73 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ ధరలు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చేశాయి. కాగా ఈ ముఖ్యమైన సమాచారాన్ని NPPA తెలియచేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఏ మెడికల్ షాప్ అయినా , లేదా మానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా ఎక్కువ ధరకు అమ్మడానికి వీలు లేదు.