సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీఎం కేసీఆర్ ఇచ్చే సీట్లు మాకు వెంట్రుకతో సమానం అన్నారు. బిజెపిపై సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చిత్తకార్తే కుక్కల్లాగా మొరిగారని.. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్లకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కెసిఆర్ బిజెపి మీద నాలుకతో మాట్లాడుతున్నారని అన్నారు. కవితని అరెస్టు చేస్తారని తెలియడంతో ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ బిజెపి పెద్దల కాళ్లు మొక్కాడని.. అందుకే కవిత బయట ఉందన్నారు.
బిజెపి మునిగిపోయిన పడవ అన్నారు నారాయణ. బుద్ధి ఉన్నోడు ఎవడు బిజెపికి ఓటు వేయరని అన్నారు. మణిపూర్ వెళ్లడానికి మోడీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కెసిఆర్ మూడవ కూటమి అనడం ఉట్టికి ఎగరలేనమ్మ అన్న చందంగా ఉందన్నారు. మూడో కూటమి అంటే బిజెపిని గెలిపించే వ్యూహంలో భాగమే అన్నారు.