తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు చెక్కులు కూడా రెడీ చేస్తోంది. అంతేకాదు సుమారు కోటి రూపాయల వరకు బోనస్ చెక్కులను కూడా… రెడీ చేసి సంతకాలు జారీ చేసింది పౌరసరఫరాల శాఖ.
దీంతో ఈ డబ్బులు రైతుల ఖాతాలలో 48 గంటల్లోపే పడబోతున్నాయి. నవంబర్ 11వ తేదీన శాంపిల్గా ఒక రైతు ఖాతాలో 500 రూపాయల బోనస్ కూడా వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 500 బోనస్ లో భాగంగా మొత్తం 30 వేల రూపాయలు ఆ రైతు ఖాతాలో జమ చేసింది తెలంగాణ పౌరసరఫరాల శాఖ. ఈ డబ్బులు వేయగానే ఆ రైతు మొబైల్ ఫోన్ కు మెసేజ్ వచ్చేలా కూడా ఏర్పాటు చేసింది. ఇదే ప్రాసెస్ మరో కోటి రూపాయల చెక్కుల పై కూడా అమలు చేయబోతుంది. సుమారు కోటి రూపాయలే 500 రూపాయల బోనస్ డబ్బులు 48 గంటల్లో రైతు ఖాతాలో పడబోతున్నాయి. ఈ డబ్బులు పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ డబ్బులు వేయనున్నారు.