మెదడు చురుకుదనాన్ని దెబ్బతీసే రోజువారి అలవాట్లు ఇవే.. వెంటనే మానుకోండి

-

పొద్దున లేవగానే సరైన ఎక్సర్సైజ్ చేస్తూ శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో రోజంతా సరైన పనులు చేస్తూ మెదడును కాపాడుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు చురుకుదనం తగ్గుతూ ఉంటుంది అందుకే వృద్ధుల్లో మతిమరుపు సమస్యలు వస్తాయి.

ముందే చెప్పినట్టు మెదడు చెరుకుదనాన్ని కాపాడుకోవాలి. దానికోసం కొన్ని అలవాట్లను వదులుకోవాలి. ఒకరోజులో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు.. మెదడు చురుకుదనాన్ని దెబ్బతీస్థాయి.

ప్రస్తుతం మెదడు చురుకుదనాన్ని దెబ్బతీసే పనులు ఏంటో తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం:

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు తమ కళ్ళను అతికించేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. సమాచారం అధికంగా లోడ్ కావటం వల్ల మెదడు షార్ప్ గా ఆలోచించ లేక పోతుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి.

పోషకాలను మర్చిపోవడం:

మెదడుకు సరైన పోషకాలను అందించి చురుగ్గా ఉంచే ఆహారాలను కాకుండా నోటికి నచ్చిన చక్కెర కలిగిన పదార్థాలను, స్నాక్స్, ఫ్రై చేసిన ఆహారాలు ఇంకా ప్రాసెస్ చేసిన పదార్థాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల మెదడు చురుకుదనం తగ్గిపోతుంది.

పాలకూర, గింజలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి.

శరీరాన్ని ఒకే స్థితిలో ఉంచడం:

మెదడు చురుగ్గా పనిచేయాలంటే మీ బాడీ కూడా చురుగ్గా ఉండాలి. ఎప్పుడూ ఒకే స్థితిలో, ఒకే చోట నిలబడుతూ ఉండడం.. లేకపోతే ఎక్కువగా కూర్చోవడం వంటి వాటి వల్ల మెదడుకి రక్తప్రసరణ సరిగ్గా జరగక చురుకుదనం లోపిస్తుంది.

ఒకేసారి పది పనులు చేయటం:

ఒక పని చేస్తున్నప్పుడు దానిమీదనే దృష్టి పెట్టాలి. అలా కాకుండా ఆ పని చేస్తూ మరో పని మొదలుపెట్టి.. అలా ఒకే టైంలో వివిధ రకాల పనులు చేయడం వల్ల మీ మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది.

కొత్త విషయాలు నేర్చుకోకపోవడం:

కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మెదడు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version