మరోసారి బయటపడ్డ రేవంత్ సర్కార్ అసమర్ధత.. టి-శాట్ చానెళ్ళకు ఇక !

-

రేవంత్ సర్కార్ అసమర్ధత మరోసారి బయటపడింది. టి-శాట్ చానెళ్ళకు సిగ్నల్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నిలిపేసింది. కేయు బ్యాండ్ జి-శాట్ 16 శాటిలైట్ సేవల కోసం ఎంఓయు పునరుద్ధరణ చేయనందుకు సిగ్నల్ ఆపేస్తాం అని జులై 5 నాడే నోటీస్ పంపింది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. పది రోజులు గడిచినా ఉలుకు పలుకు లేకుండా రాష్ట్ర ఐటి శాఖ వ్యవహరించింది. దీంతో ఇవ్వాళ పూర్తిగా సిగ్నల్ నిలిపేసింది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.

revanth reddy

తెలంగాణ ఏర్పడ్డ తరువాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన సాప్ నెట్ అనే సంస్థను టి-శాట్ అనే పేరుతో పునరుద్ధరణ చేశారు అప్పటి ఐటి శాఖ మంత్రి కేటీఆర్. సంస్థకు సీఈవోగా సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డిని నియమించి నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం “నిపుణ”, “విద్య” అని రెండు చానెళ్లు ప్రారంభించారు. ఇవి రెండు అటు విద్యార్థుల్లో, ఇటు నిరుద్యోగుల్లో బహుళ ప్రజాదరణ పొందాయి.

రేవంత్ సర్కార్ రాగానే శైలేష్ రెడ్డి స్థానంలో ఏ మాత్రం అనుభవం లేని బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి అనే జర్నలిస్టుకు రేవంత్ రెడ్డి సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. తనకు తెలియకుండానే తన శాఖలో ఒక సంస్థకు సీఈవో నియమించడంపై అప్పట్లో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కొంత కినుక వహించారు. అప్పటి నుండి క్రమంగా సంస్థ దిగజారుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా రెండు చానెళ్లు మూతపడే స్థితికి వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version