నిరుద్యోగులు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయకుండా ప్రజావాణికి రావాలి : చిన్నారెడ్డి

-

నిరుద్యోగ యువకులు కొందరి ప్రొద్బలం వల్లే ఆందోళనలు చూస్తున్నారని, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయకుండా ప్రజావాణికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి అన్నారు. సెక్రటేరియట్ లోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన నిరుద్యోగులు ధర్నాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు రాజకీయ నాయకులు ఆర్టిఫిషియల్ ఉద్యమాలు చేయిస్తున్నారని, విద్యార్థుల బలిదానం, త్యాగాలను గుర్తించి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని, గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చి, పరీక్షలు రాయడమే కాక రిజల్ట్స్ కూడా వచ్చాయన్నారు.

అలాగే మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామని తెలిపారు. ఇక 11 వేల పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి, హాల్ టికెట్లు కూడా విడుదల చేశారని, ఈ డీఎస్సీ తో పాటు మరో డీఎస్సీని 9 వేలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, క్వాలిటి టీచర్స్ ఎంపిక కోసం రెండు డీఎస్సీలను నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు. అంతేగాక 30 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజిలలో పేర్లు నమోదు చేసుకున్నారని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరియు ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. కోచింగ్ సెంటర్ల వాళ్లు కొంతమంది విద్యార్థులను ప్రేరేపించి ఆందోళన చేయిస్తున్నారని, నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటికి పోయి ధర్నా చేయడం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version