Telangana: రేవంత్ రెడ్డి సర్కార్ కు ఊహించని షాక్ తగిలింది. మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు వీఆర్ఏలు. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు వీఆర్ఏలు. 15 నెలలుగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసనకు దిగారు.
మంత్రిని కలవడానికి అనుమతి ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు వీఆర్ఏలు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. అయినప్పటికీ… మినిస్టర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు వీఆర్ఏలు. అటు వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితి మారింది.
బ్రేకింగ్ న్యూస్
మినిస్టర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన వీఆర్ఏలు.. అడ్డుకుంటున్న పోలీసులు
పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట
ఉద్రిక్తంగా మారిన పరిస్థితి https://t.co/gcxOewTnIi pic.twitter.com/XxoClpSw7c
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2025