కేసీఆర్ మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. వాస్తవాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. కాళేశ్వరంలో జరిగిన పొరపాటును కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణం అన్నారు.
ఎన్టీపీసీ తెచ్చానని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్ట్ అప్పుడే ఎందుకు ప్రారంభింలేదన్నారు. నీళ్ల గురించి, కాళేశ్వరం గురించి వాస్తవాలు చెప్పలేదు. యాదాద్రి ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించారు..? ఎవరి వల్ల ఆలస్యం జరిగిందని ప్రశ్నించారు భట్టి. వ్యవస్థలను దారికి తీసుకొచ్చేందుకు మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నాం. యాదాద్రి ప్రాజెక్ట్ నిర్మించిన స్థలమే కరెక్ట్ కాదన్నారు. నీ మైకు సరిగ్గా పని చేయకపోతే.. దానికి కరెంట్ పోయిందనడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పుడు ఎన్టీపీసీ మొదలు పెడితే దాదాపు ఐదేళ్ల సమయం పడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.