స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది ఓ కారు.
ఇక ఘటనలో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. దీంతో స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ కుటుంబం తీవ్ర విషాదం లోకి వెళ్లింది. కారు అతి వేగంగానే రావడంతోనే… ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఇక ఈ సంఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇది ఇలా ఉండగా… రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్. ఇక ఇంతలోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.