Telangana: 10వ తరగతి పరీక్ష విధానంలో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. పాత విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. 10వ తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ మొన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 100 మార్కులతో ఎగ్జామ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
అయితే… ఈ విద్యా సంవత్సరంలో పాత విధానం 20 శాతం ఇంటర్నల్ మార్కులు కలుపనుంది.. 80 శాతం ఎగ్జామ్ మార్కులు ఉంటాయని తెలిపింది. దీంతో 10వ తరగతి పరీక్ష విధానంలో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలోనే…. 10వ తరగతి విద్యార్థులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.