కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశముంది : మహేష్ కుమార్ గౌడ్

-

కేటీఆర్‌ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలన పై ప్రజలు విసిగి పోయారని.. అందుకే తమకు అధికారం అప్పగించారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్దమని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే జైలుకు పోతానని అంటున్నాడని.. తప్పు చేశామని తెలుసు కాబట్టే అలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Mahesh Goud

గత ప్రభుత్వం గడిచిన పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని.. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పలువురు బీఆర్ఎస్ అగ్రనాయకులు బీజేపీలోకి వెళ్తారని సంచలన కామెంట్స్ చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండబోరని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version