ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు : డిప్యూటీ సీఎం భట్టి

-

ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని  డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పులపై బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.54వేల కోట్ల అప్పులు చేసింది. బీఆర్ఎస్ చేసిన అప్పులకు నెలకు రూ. 6,722 కోట్లు  చెల్లిస్తున్నామని.. రైతుల అప్పులు కూడా  21వేల కోట్లు చెల్లించామని తెలిపారు.

లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేము సిద్ధం అని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అప్పులేమో తినడానికి.. మా అప్పులేమో వడ్డీ కట్టడానికి అన్నారు. వ్యవసాయ పశు షెడ్లకు సంబంధించి, బోరు షెడ్లకు 11, 270 కోట్లు చెల్లించామని తెలిపారు. వ్యవసాయ ప్రాజెక్టులకు పెండింగ్ పెడితే.. 9,795 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని తెలిపారు. పంట నస్టపరిహారం చెల్లించామని.. పదేళ్లలో పంట నష్టపరిహారం చెల్లించారా..? అని ప్రశ్నించారు. రైతు వేసిన పంటకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version