తెలంగాణలో లీకేజీల వ్యవస్థ కాదు… ప్యాకేజి తీసుకునే వ్యవస్థ నడుస్తుందని ఆరోపించారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి. టీఎస్పీఎస్సీ మొదలుకుని.. ఎస్ఎస్సి పేపర్ వరకు అన్ని లీకులేనని.. కేవలం పోలీసు శాఖ లో మాత్రమే రిక్రూట్ మెంట్ లు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలను అణచివేతకె పోలీసు రిక్రూట్మెంట్ లు చేపడుతున్నారని ఆరోపించారు శివసేనారెడ్డి. తెలంగాణ నిరుద్యోగులు బయటకు రావాల్సిందేనని పిలుపునిచ్చారు.
టీఎస్పీఎస్సీ లో జరిగిన అన్ని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో కొత్త కమిటీ వేయాలని… కొత్త కమిటీ ఆధ్వర్యంలోనే రిక్రూట్మెంట్ లు జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ యూత్ నాయకులని తప్పుడు కేసులు పెట్టి జైల్ కి పంపారని.. జైల్ కి పోవడానికి మేం భయపడమని అన్నారు. అమ్మాయిల తో రాసలీలల ఎమ్మెల్యేలపై కేసులు ఉండవు, దందా చేసే ఎమ్మెల్యే పై కేసులు ఉండవు, ఉద్యోగాల కోసం కొట్లాడితే జైల్ కి పంపుతున్నారని మండిపడ్డారు.