AP: డెడ్ బాడీ పార్సిల్ కేసులో ట్విస్ట్‌..ముగ్గురు భార్యలు !

-

AP: డెడ్ బాడీ పార్సిల్ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి డెడ్ బాడీ పార్సిల్ కేసు విచారణలో పురోగతి లభించింది. ఆస్తి కోసం అత్యాశకుపోయి అమాయకుడి హత్య చేశారట. కూలి పనులు చేసుకునే బర్రె పర్లయ్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మ. ఇక మృత దేహాన్ని చూపించి వదిన, అత్త మామలను బెదిరించి భారీగా డబ్బు వసూలు చేయాలని ప్లాన్ వేశాడు.

గత ఐదు నెలలుగా ప్లాన్ అమలు చేసేందుకు ప్రయత్నాలు చేసిన నిందితుడు.. రెండో భార్య రేవతి సహకారంతో బర్రె పర్లయ్యను హత్య చేశాడు. మూడో భార్య సహకారంతో డెడ్ బాడీని సాగి తులసి ఇంటికి ఆటోలో పంపినట్టు గుర్తించారు పోలీసులు. నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మ…. ముగ్గురు భార్యలు ఒకరికి తెలియకుండా ఒకరు భర్తకు సహకరించారు.

తన మూడు పెళ్లిళ్ల గురించి, వివాహేతర సంబంధాలు గురించి గుట్టుగా ఉంచాడు వర్మ. చేపల చెరువులు లీజు చేస్తున్నట్టుగా ఒకరికి, స్థానిక ఆక్వా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అందరినీ నమ్మించాడు నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మ. ఇక నిందితుడికి ఆదాయం ఏ రకంగా సమకూరుతుందని అంశాలపై లోతైన విచారణ చేపట్టారు పోలీసులు. ప్రత్యేక బృందాల ద్వారా పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version