సీఎం రేవంత్ రెడ్డి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు – దిల్‌ రాజు

-

సీఎం రేవంత్ రెడ్డి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు… అది రీచ్ అవాలని చూస్తున్నామన్నారు దిల్ రాజు. సంక్రాంతి సినిమాలు, సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అది ఇంపార్టెంట్ కాదని తెలిపారు దిల్ రాజు. సీఎం రేవంత్‌ రెడ్డితో మీటింగ్‌ ముగిసిన అనంతరం దిల్‌ రాజ్‌ మాట్లాడారు. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందన్నారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామని వివరించారు దిల్‌ రాజు.

Dil Raju

హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారన్నారు దిల్ రాజు. కేవలం ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో ఎదగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చ జరిగిందన్నారు దిల్‌రాజు. సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదని బాంబ్‌ పేల్చారు దిల్‌ రాజు. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని… టిక్కెట్ రేటు పై, బెనిఫిట్ షోలు పై ఇప్పుడు చర్చ జరగలేదన్నారు. ఇంకా మా చర్చలు అంత వరకు రాలేదని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version