గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంతపార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీలో తనపై కుట్ర జరుగుతోందని, కొందరు నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. తనను జైలుకు పంపేందుకు మరోసారి ప్రయత్నించారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పీడి యాక్ట్ కేసులు పెట్టమని స్వయంగా బీజేపీ నేతలే చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారని పేర్కొన్నారు.
కాగా, బీజేపీకి త్వరలో నూతన అధ్యక్షుడు రానున్న తరుణంలో ఆయన కొందరు సీనియర్లపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్‌ని సీక్రెట్‌గా భేటీ అవుతున్నారని చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన స్వలాభం కోసం కాకుండా పార్టీ, కార్యకర్తల కోసం పనిచేసే వారికి అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని రాజాసింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.