తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగ భద్రత కోరతూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.అడ్వొకేట్ ఇజ్రాయిల్ హత్యపై నిరసన తెలిపిన న్యాయవాదులు తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్యర్యంలో శాసనసభ ముట్టడికి యత్నించారు.
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారంతా డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత లేదని, వెంటనే ఉద్యోగ భద్రత కల్పించేలా చట్టం చేయాలని కోరాతూ అసెంబ్లీ వైపు దూసుకువెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు న్యాయవాదులను అడ్డుకున్నారు.దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే లాయర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసెంబ్లీ పరిసరాల నుంచి తరలించారు.