ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అని పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్. నీళ్లు లేకపోతే మన బతుకు లేదు. గతంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాల వాసులు నడుములు వంగి ఫ్లోరైడ్ సమస్యతో బాధపడేవారు. ప్రధానమంత్రి ముందు వారి సమస్యను ఉంచినా కానీ పట్టించుకున్న నాథుడు లేడు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాలుగేండ్లలోనే ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించామని తెలిపారు కేసీఆర్.
పదేళ్లలో నేను ఏమి తక్కువ చేయలేదు. ఎక్కడి నుంచో కరెంట్ తెచ్చి కోతలు లేకుండా చేశాం. మనల్ని మనం కాపాడుకునే ఎవ్వరూ మనకు రారు. మన నీళ్లు కాజేద్దామనుకునే స్వార్థపరులకు ఇది ఒక హెచ్చరిక సభ అన్నారు కేసీఆర్. మిషన్ భగీరథ నీళ్లతో ఫొరైడ్ బాధలు పోయాయి. బీఆర్ఎస్ హయాంలో బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తి అయింది.. డిండి ప్రాజెక్టు పూర్తి కాబోతుందని తెలిపారు. కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య.. కాంగ్రెస్ నేతలు వందల కొద్ది కేసులు వేశారు. తమ ప్రభుత్వం కేంద్రానికి వంద ఉత్తరాలు రాసినా నీటి సమస్య పరిష్కారం కాలేదు అన్నారు కేసీఆర్.