తెలంగాణలో ఘోర ఓటమిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ అగ్రనాయకత్వానికి శుభాకాంక్షలు చేప్పారు పవన్ కళ్యాణ్. విజేతలందరికీ అభినందనలు అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం భవిష్యత్తు ఫలితాలకు గొప్ప దిక్సూచి అని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నా అని పేర్కొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీ – జనసేన కూటమిని గౌరవించి, ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని వెల్లడించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
తెలంగాణ రాష్ట్రంలో పోటీ జనసేనకు ఒక ప్రత్యేక మైలు రాయి అన్నారు.. తెలంగాణలో జనసేన తన తొలి అడుగును ఈ ఎన్నికలతో ప్రారంభించాలని సంకల్పించి అభ్యర్థులను బరిలో నిలిపాం. నా నిర్ణయాన్ని అభినందించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చెప్పారు పవన్ కల్యాణ్.