ఒక్క లైసెన్స్ మూడు పబ్బులు.. అమ్నీషియా యాజమాన్యం వింత పోకడలు

-

కోర్టు ఆదేశాలను పబ్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించిన పబ్ లపై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్క బార్ లైసెన్స్ తో మూడు పబ్ ల అమ్నేషియా యాజమాన్యం వింత పొగడలు బయటపడ్డాయి. ఇండియన్ బూజింగ్ కంపెనీ పేరుతో ఎక్సైజ్ శాఖ బార్ లైసెన్స్ మంజూరు చేసింది.

మూడు ఫ్లోర్లలో వేర్వేరు పేర్లతో పబ్ ల నిర్వహణ చేపడుతుంది యాజమాన్యం. దీంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అమ్నేషియా ఇన్సొమ్నియా పబ్ యాజమాన్యం నిర్వాకాలు. ఒక్కో అంతస్తులో ఒక్కో పేరుతో పబ్స్ నిర్వహణ చేపడుతుంది యాజమాన్యం. అమ్నేశియా, ఇన్ సొమ్నియ, వొయ్లా పేర్లతో మూడు పబ్స్ ని నిర్వహిస్తున్నారు. ఎక్సయిజ్, పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు పబ్ నిర్వాహకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version