బీజేపీకి తుల ఉమ రాజీనామా చేశారు. బిజెపి నేత తుల ఉమా సొంతగూటికి చేరనున్నారు. దీంతో నాలుగు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెలపడింది. వేములవాడ నుంచి బీజేపీ టికెట్ ఆశించిన ఆమె చివరి నిమిషంలో తీవ్ర అవమానాల పాలయ్యారు. వేములవాడ అసెంబ్లీ సీటుకు టికెట్ ఇచ్చిన బిజెపి చివరి నిమిషంలో బిఫామ్ వేరొకరికి ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
తన అనుచరులతో సమావేశాలు అనంతరం తిరిగి బిఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయించుకున్నారు. కెసిఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. పార్టీలో చేరే విషయం చర్చించారు. కేసీఆర్ స్పష్టమైన హామీల తర్వాత బీఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అనుచరులు నిన్నటి నుంచి సిరిసిల్లలోని బిఆర్ఎస్ కార్యాలయంలోనే ఉన్నారు. నేడు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు.