డ్ర‌గ్స్ నిర్ముల‌న‌కు నేడు సీఎం కేసీఆర్ కీల‌క భేటీ

-

రాష్ట్రంలో మాద‌క ద్ర‌వ్యాల వినియోగం పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్రంలో మాద‌క ద్ర‌వ్యాలు అనే పేరు కూడా విన‌ప‌డ‌కుండా పూర్తి గా నిర్మిలించ‌డానికి అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే డ్ర‌గ్స్ విషయంలో అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను ఇచ్చారు. కాగ ఈ రోజు మరోసారి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. సీఎం కేసీఆర్ అధ్య‌క్షతన రాష్ట్ర స్థాయి పోలీసు, అబ్కారీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ప్ర‌గ‌తి భ‌వ‌న‌లో జ‌రిగే ఈ స‌మావేశంలో హొం మంత్రి మ‌హ్మ‌ద్ అలీ, అబ్కారీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ తో పాటు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన‌నున్నారు. రాష్ట్రంలో మాద‌క ద్ర‌వ్యాల‌ను నిర్ములించ‌డానికి చేయాల్సిన కార్య‌క్ర‌మాల‌పై అధికారుల‌కు సీఎం కేసీఆర్ దిశా నిర్ధేషం చేయ‌నున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మాద‌క ద్ర‌వ్యాల క‌ట్ట‌డికి దాదాపు 1000 మందితో ప్ర‌త్యేక బృందం ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ బృందం విదివిదానాల పై కూడా సీఎం కేసీఆర్ ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు. కాగ ఇప్ప‌టికే రాష్ట్రంలో డ్రగ్స్ ను విక్ర‌యిస్తున్న మూఠాల‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version