జాతీయ బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ కరీంనగర్ రానున్నారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత పూర్తి అయింది. ఈ సందర్భంగా కరీంనగర్ లో నిర్వహించే ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఈ మీటింగ్ జరగనుంది.
ఈ మేరకు రాష్ట్ర బిజెపి నాయకత్వం అన్ని ఏర్పాటు చేస్తోంది. సభ జరిగే స్థలంలో సౌకర్యాలు, జన సమీకరణ పై దృష్టి సారించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాటు వరంగల్, నిజామాబాద్ అలాగే అదిలాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై ఫోకస్ పెట్టింది. బండి సంజయ్ ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్య ఆ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ దాదాపు లక్ష మంది ఈ సభకు వచ్చేలా బిజెపి ప్లాన్ చేస్తోంది.