చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర 9 గంటలుగా ట్రాఫిక్ జామ్ !

-

చిలుకూరు బాలాజీ దేవాలయంకు వెళ్లే దారిలో 9 గంటలుగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ శివారులో ఊహించని భారీ ట్రాఫిక్ జామ్ ఉంది.అప్పా జంక్షన్ & కాళి మండిర్ & టిప్పు ఖాన్ బ్రిడ్జి రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. దీంతో కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచి పోయాయి. 9 గంటలుగా ట్రాఫిక్ జామ్ అయింది. చిలుకూరు బాలాజీ దేవాలయం కు భక్తులు…బారులు తీరారు.

Traffic jam near Chilukur Balaji temple for 9 hours

సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఈ తరుణంలోనే..
హైదరాబాద్ ఇతర జిల్లాల చుట్టూ పక్కల నుంచి కార్లల్లో భారీగా చేరుకుంటున్నారు భక్తులు. దీంతో రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి స్కూల్ బస్సులు, పలు వాహనాలు. దీంతో విద్యార్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. అయినా… ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version