హైద‌రాబాద్‌ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

-

హైదరాబాద్ వాసులకు అలర్ట్. నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. న‌గ‌రంలోని మ‌క్కా మ‌సీదు, సికింద్రాబాద్ ప‌రిధిలోని జామియా మ‌సీదు ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జుమాత్ ఉల్ విద ప్రార్థ‌న‌ల నేప‌థ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు పేర్కొన్నారు.

చార్మినార్ – మ‌దీనా, చార్మినార్ – ముర్గి చౌక్, చార్మినార్ – రాజేశ్ మెడిక‌ల్ హాల్, శాలిబండ మ‌ధ్య వాహ‌నాల రాక‌పోక‌లను నిషేధిస్తున్న‌ట్లు తెలిపారు. న‌యాపూల్ నుంచి చార్మినార్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌న మ‌దీనా జంక్ష‌న్ నుంచి సిటీ కాలేజీ వైపున‌కు మ‌ళ్లిస్తారు. శాలిబండ నుంచి చార్మినార్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను హిమ్మ‌త్‌పురా జంక్ష‌న్ వ‌ద్ద హ‌రి బౌలి, వోల్గా హోట‌ల్ టీ జంక్ష‌న్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

కోట్ల అలిజా నుంచి చార్మినార్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను చౌక్ మైదాన్ ఖాన్ వ‌ద్ద హాఫీజ్ డంకా మ‌సీదు, అమ‌న్ హోట‌ల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. మూసాబౌలి నుంచి చార్మినార్ వ‌చ్చే వాహ‌నాల‌ను మోతిగ‌ల్లి వ‌ద్ద ఖిల్వాత్ గ్రౌండ్, రాజేశ్ మెడిక‌ల్ హాల్, ఫ‌తే మైదాన్ రోడ్డు మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. సుభాష్ రోడ్, మ‌హంకాళి పీఎస్, రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్ష‌న్ ఎంజీ రోడ్డును ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు మూసివేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version