తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తూనే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దేశంలోని పరిస్థితులను తెలంగాణతో పోలుస్తూ టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దేశంలోని కరెంట్ సమస్యలపై తనదైన శైలిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమావాస్య రోజు హెలికాప్టర్ వేసుకొని వస్తే దేశములో ఎక్కడ వెలుగులు కనిపిస్తే అదే తెలంగాణ రాష్ట్రం అని సెటైర్లు వేశారు.