BREAKING : యువతి కోసమే TSPSC పరీక్ష పేపర్ లీక్

-

TSPSC వెబ్ సైట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. టీఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాక్ చేశారు కొందరు సైబర్ కేటుగాళ్లు. TSPSC వెబ్ సైట్ హ్యాక్ కావడంతో…. తెలంగాణలో మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా వేసింది టీఎస్‌పీఎస్సీ.

అయితే, ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. TSPSC సెక్రటరీ పిఏ ప్రవీణ్ పేపర్ ను లీడ్ చేసినట్లు తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు. కాగా, కంప్యూటర్ హ్యాక్ అయిందనే అనుమానంతో ఇవాళ జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షతోపాటు ఈ నెల 15, 16న జరగాల్సిన వెటర్నరీ సర్జన్ రాత పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version