తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త జట్టు ఇదే

-

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రక్షాళన షురూ అయింది. టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తూ సర్కారు జీఓ విడుదల చేసింది. పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి గత నెలలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ సహా నలుగురు బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో మాజీ డీజీపీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డిని ఛైర్మన్గా నియమించారు.

కమిషన్ ఛైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అనిత రాజేంద్రన్, విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి అమీర్ ఉల్లాఖాన్, జేఎన్ టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జెన్ కో విశ్రాంత చీఫ్ ఇంజినీర్ యారబడి రామ్ మోహన్ రావు, విశ్రాంత అధికారిణి పాల్వయి రజనీ కుమారిలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బుధవారం రోజున ఆమోదముద్ర వేయగా కొత్త బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version