తెలంగాణలో ఎంసెట్‌ ఇక నుంచి ఎప్‌సెట్‌.. షెడ్యూల్ వచ్చేసింది

-

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌-ఎంసెట్‌ పేరును మారుస్తామని గత కొంతకాలంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ దిశగా కీలక అడుగు పడింది. టీఎస్ఎంసెట్ పేరును మారుస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.  ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష పేరును తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష- ఎప్సెట్ (EAPCET) గా మార్చింది.

ఆయా పరీక్షలకు నిర్వహణ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి గురువారం రోజున విడుదల చేసింది. ఎప్‌సెట్‌ను మే 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తారు. తొలి మూడు రోజులు ఇంజినీరింగ్‌ విభాగం, చివరి రెండు రోజులు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి.. మే 6వ తేదీన టీఎస్ – ఈసెట్, జూన్ 4వ తేదీన ఐసెట్, జూన్‌ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు టీఎస్ పీజీఈసెట్ నిర్వహిస్తామని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version