గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ డివిజన్ బెంజ్ లో పిటిషన్ వేయనుంది. పరీక్ష నిర్వహించిన తీరు మరియు తీసుకున్న జాగ్రత్తలు తదితర అంశాలతో అప్పిల్కు వెళ్ళనుంది టీఎస్పీఎస్సీ.
బయోమెట్రిక్ అసలు అమలు చేయలేదనే విషయం పై స్వస్థత ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ. అలాగే గ్రూప్ వన్ పరీక్షకు ప్రిలిమ్స్ ప్రధానం కాదని… మెయిన్స్ కూడా ఉంటుందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. మరి దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
కాగా, గ్రూప్-1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి గారి ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగా.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడటం దురదృష్టకరం అన్నారు.