TSRTC : మహాశివరాత్రి స్పెషల్.. 40 శైవక్షేత్రాలకు 2,427 ప్రత్యేక బస్సులు

-

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు టీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం 40 శైవక్షేత్రాలకు 2,427 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం క్షేత్రానికి 578 బస్సులు, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ కాలనీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి పత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఈ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version