లగచర్లలో ఘటనలో ట్విస్ట్…సెంట్రల్ జైలుకు NHRC బృందం

-

లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది…సెంట్రల్ జైలుకు NHRC బృందం వెళ్లింది. సంగారెడ్డి సెంట్రల్ జైలుకి వచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్… కీలక విచారణ చేయనుంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో జైలులో ఉన్న వారిని వివరాలు అడిగి తెలుసుకుంటోంది 8 మంది NHRC బృందం.

Twist in Lagacharlo incident NHRC team to Central Jail

సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న A2 సురేష్ తో పాటు 19 మంది ఉన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న A2 సురేష్ తో పాటు 19 మందిని విచారించనుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.

ఇక అటు సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఘాటు విమర్శలు చేశారు.రేవంత్ రెడ్డి..నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని, అప్పుడు ఫార్మాసిటీ అని చెప్పి, ఇప్పుడు మాట మారుస్తారా? ప్రశ్నించారు. కొడంగల్‌లో ఫార్మాసిటీ కాదు..పారిశ్రామిక కారిడార్ వస్తుందని అని సీఎం రేవంత్ చెప్పడంపై విమర్శలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version