మహారాష్టలో మోడీ చేసిన మ్యాజిక్ అదేనా..? హర్యానా ఫార్ములా వర్కౌట్ అయిందా..?

-

చరిత్ర గుర్తుంచుకునేలా మహారాష్టలో బిజేపీ గ్రాండ్ విక్టరీని కొట్టింది.. మోదీ మ్యాజిక్ తో మ్యాజిక్ ఫిగర్ కూడా చిన్నబోయింది.. అనుమానాలన్నీ పటాపంచల్ చేస్తూ.. బిజేపీ పెట్టుకున్న అంచనాలు నిజమయ్యేలా ప్రజలు తీర్పునిచ్చారు.. మహావికాస్ అఘాడియా ఎన్ని హామీలిచ్చినా.. మోదీపైనే మాకు విశ్వాసం అన్నట్లుగా మరాఠ ఓటర్లు వన్ సైడ్ గా తీర్పునిచ్చారు.. బీజేపీ ఈ స్థాయి విజయానికి కారణం ఏంటి? సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఏంటి..? హర్యానా ఫార్ములా ఎంటి..?

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి చేతిలో దెబ్బతిన్న కమలం పార్టీ అసెంబ్లీ ఎన్నికలు నాటికి బౌన్స్ బ్యాక్ అయ్యింది. మహారాష్టలో తమకు తిరుగులేదని బిజేపీ నిరూపించింది.. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ను కూల్చి బీజేపీ పగ్గాలు చెపట్టిందనే విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.. సంక్షేమం, అభివృద్ది జరిగితే చాలనుకున్నారు.. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా బిజేపీకి భారీ విజయాన్ని అందించారు..

ప్రధాని నరేంద్రమోడీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. దేశంలోని అన్ని రాష్టాల్లో బిజేపీ పార్టీలే అధికారంలో ఉండాలనుకున్న ఆ కోరిక నెరవేరుతోంది.. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే కూటమి 210 స్థానాలకుపైగా జనం పట్టం కట్టారు. ఎన్నికలకు ముందే ఏర్పడిన ఓ కూటమిని మహా ఓటర్లు గెలిపించడం 1990 తర్వాత ఇదే. ఈ స్థాయి మెజారిటీ దక్కుతుందని బీజేపీ కూడా ఊహించలేదట.

మహావికాస్ అఘాడియా చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే.. మోదీ వ్యూహాత్మకంగా పావులు కదిపారు.. హర్యానా ఫార్ములానే మహారాష్టలో కూడా పక్కాగా అమలు చేశారు.. హర్యానాలో నాన్ జాట్లను ఏకం చేసినట్లు మహారాష్ట్రలో ఓబీసీల సమీకరణలో ఎన్డీయే విజయం సాధించింది.. మరాఠా ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు గ్రహించిన బిజేపీ.. స్టాటజీతో ముందుకెళ్లింది.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మాద్వా ఫార్మాలను అప్లయ్ చేసింది.

మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందనే భయంలో ఉన్న మాలి, దంగర్, వంజరి వర్గాలను దగ్గరకు తీసుకుంది.. వాటిని ఓట్లుగా మలుచుకుని గ్రాండ్ విక్టరీని స్వంతం చేసుకుంది.. కేవలం మరాఠ ఓటర్ల మీదే ఆధారపడితే కష్టమని భావించిన బిజేపీ.. అటువైపు నుంచి నరుక్కొచ్చింది.. దీంతో మరాఠా ఓట్లను నమ్ముకున్న మహావికాస్ అఘాడియా మరోసారి బోల్తా పడింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version