Ujjaini Mahankali Secunderabad Bonalu 2025: రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగనున్నాయి. సోమవారం రంగం భవిష్యవాణి, అమ్మవారి అంబారీ ఊరేగింపు ఉంటుంది. ఈ తరుణంలోనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

భారీ పోలీసు బందోబస్తు, సీసీటీవీ నిఘా మధ్య బోనాల జాతర జరుగనుంది. బోనాల జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కాగా హైదరాబాద్ మహానగరంలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్లో బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ బంద్ చేయబోతున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్ అలాగే వేస్ట్ హైదరాబాద్లో వైన్స్ తో పాటు బార్లు కూడా బంద్ కానున్నాయి. అంటే రెండు రోజులపాటు ఈ బంద్ కొనసాగనుంది.