కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై ఒత్తిడి చేస్తుంది – మంత్రి ఎర్రబెల్లి

-

రైతులను మోసం చేస్తూ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు గ్రామపంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాలలో మంత్రి ఎర్రబెల్లి లక్డిదారులకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై ఒత్తిడి చేస్తుందని.. సీఎం కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తేల్చి చెప్పి రైతుల పక్షాన నిలబడ్డ ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ కాదా? అని అన్నారు. దేశంలో బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు లేవని అన్నారు.

బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులను తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని.. కానీ రాష్ట్రంలో బిజెపి నాయకులు అసత్య ప్రచారంతో మత రాజకీయాలు చేస్తూ ప్రజలకు మధ్య విద్వేషాలు సృష్టిస్తూ కెసిఆర్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version