పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలి : ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

-

మైనార్టీల అభివృద్ధి  కృషి చేస్తే కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణం పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చామని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే.. గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పని చేయాలి. పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని కోరుతున్నాం. 

కాంగ్రెస్ మెనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావనే లేదని.. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి పాలకులకుగా చాలా అనుభవం ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేస్తారు అనుకుంటాను. 3 లక్షల 10 వేల కోట్ల రూపాయలు కావాలి. కాంగ్రెస్ ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు కాంగ్రెస్ అన్ని చూసే మ్యానిఫెస్టో అమలు చేస్తుందనుకుంటున్నా.  మరోవైపు గవర్నర్ ప్రసంగం మొత్తం కాంగ్రెస్ హామీలు చదివారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని  స్వాగతిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version