రాజీనామా సమర్పించేందుకే కేసీఆర్ కేబినెట్‌ మీటింగ్‌ : ఉత్తమ్‌

-

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా చేసేందుకే డిసెంబర్ 4వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారేమో అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ కార్యకలాపాలపై సీఈవో వికాస్‌రాజ్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుబంధు నిధులను గుత్తేదార్లకు చెల్లించకుండా చూడాలని సీఈవోకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

“రేపు గెలుపు ధ్రువపత్రాలను మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారు. ఈ మేరకు ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈఓను కోరాం. ఎల్లుండి కేసీఆర్‌ కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్‌ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు. రాజీనామా సమార్పించేందుకే కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఉండొచ్చు. నచ్చిన గుత్తేదార్లకు రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నం. ఈ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని ఈసీని కోరాం. అసైన్డ్ భూముల రికార్డులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version