కాంగ్రెస్ కి వచ్చే సీట్లు ఎన్నో తేల్చి చెప్పిన కే.ఏ.పాల్

-

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని స్పష్టమవుతోంది. అదేవిదంగా బీఆర్ఎస్ కూడా తామే అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజా శాంతి పార్టీ చీఫ్ కే.ఏ.పాల్ సీఈవో వికాస్ రాజ్ పై సంచలన ఆరోపణలు చేశారు. సీఈవో వికాస్ రాజ్ పెద్ద డ్రామా నడుపుతున్నారని పేర్కొన్నారు. అవినీతి చక్రవర్తిగా సీఈవో మారుతున్నారని ఫైర్ అయ్యారు.

వికాస్ రాజ్ పై చీఫ్ జస్టీస్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బుతో వికాస్ రాజ్ ను కొనేశారా..? రిటైర్డ్ అధికారి దగ్గర డబ్బులు ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు తన మాట విన్నారని.. నూటికి 40 శాతం మాత్రమే ఓటు వేశారని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 58-63 సీట్లు వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని.. వారిని ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version