మేము చెప్పేదాక మేడిగడ్డపై మరమత్తులు చేయొద్దని ఎల్ అండ్ టీ కంపెనీకి ఉత్తమ్ హెచ్చరికలు చేశారు. మేడిగడ్డపై మరమత్తులు చేసేందుకు ఎల్ అండ్ టీ కంపెనీ ముందుకు వచ్చింది. జరిగిన నష్టాన్ని మొత్తం భరిస్తామని వెల్లడించింది. మేము చెప్పేదాక మేడిగడ్డపై మరమత్తులు చేయొద్దని ఉత్తమ్ హెచ్చరికలు చేశారు.
అసలు మిమ్మల్ని మరమ్మతుల మీద రివ్యూ చేయమని ఎవరు చెప్పరంటూ మంత్రి ఉత్తమ్ గరం గరం అయ్యారట. అయ్యర్ కమిటీ సిఫార్సులొచ్చాకే రిపేర్లు చెయ్యాలని ఆదేశించారట. బ్యారేజ్ మరమ్మత్తులకై నిర్మాణ సంస్థ ఎల్ & టీ సంస్థతో ఇటీవల నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ అనిల్ కుమార్ చర్చలు జరపడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వ అనుమతి లేకుండా, పాలసీకి విరుద్ధంగా మరమ్మత్తులు ఎలా చేస్తారంటూ ఉత్తమ్ ఫైర్ అయ్యారట. దీంతో ఇప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్ అయింది.