తెలుగు రాష్ట్రాలలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. వర్షాకాలం వచ్చినప్పటికీ వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడిపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. పలు ప్రాంతాలలో కిలో పచ్చిమిర్చి రూ. 100, బీన్స్ రూ. 90, చిక్కుడు రూ. 50-75, క్యాప్సికం రూ.75, టమాట రూ. 45-50, బెండకాయ కేజీ రూ. 45గా ఉన్నాయి.

వారానికి సరిపడా 500 రూపాయలు పెట్టి కూరగాయలు కొనుగోలు చేసేవారు ధరలు విపరీతంగా పెరగడంతో కూరగాయలు ఎలా కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయం పైన తప్పకుండా చర్యలు చేపట్టాలని కూరగాయల ధరలను దించాలని అంటున్నారు. లేకపోతే సామాన్య మానవులపై అధికంగా ప్రభావం పడుతుందని వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.