ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో దినసరి వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అలాగే చిన్న చిన్న సహాయక పనులు చేసే మసాల్చీలకు దినసరి వేతనాన్ని పెంచుతుంది తాజాగా నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.

రోజువారి వేతనం 300 రూపాయల నుంచి 570 రూపాయలకు పెంచుతున్నట్లు ఏపీ మంత్రి ఫరూక్ వివరించారు. దీంతో పాటు వేతనాన్ని నెలలో 26 రోజుల వరకు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పెంపుతో మసాల్చీలు.. నెలకు 14,820 వరకు పొందుతారని ఈ సందర్భంగా ప్రకటన చేశారు.