బీర్ బాటిల్స్ మీద స్టిక్కర్స్ వేసి వేముల వీరేశం వెరైటీ ప్రచారం !

-

నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం వివాదంలో చిక్కుకున్నారు. బీర్ బాటిల్స్ మీద స్టిక్కర్స్ వేసి నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం వెరైటీ ప్రచారం చేస్తున్నారు. నకిరేకల్ నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో బీర్ బాటిల్స్ మీద స్టిక్కర్స్ వేసి.. ఓటర్లకు పంచుతున్నారట. ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Vemula Veeresham variety campaign by putting stickers on beer bottles

కాగా..  నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం కలిమెర, మునుకుంట్ల గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే 6 గ్యారెంటీలను ప్రజలకు తెలిపారు. హస్తం గుర్తుకే ఓటేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version