బీఆర్ఎస్ అధిష్టానానికి వేములవాడ ఎమ్మెల్యే హెచ్చరిక !

-

బీఆర్ఎస్ అధిష్టానానికి వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌ బాబు వార్నింగ్‌ ఇస్తూ పోస్ట్‌ పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఇవాళ అసెంబ్లీ టికెట్లు ప్రకటించనుంది. ఈ సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇక ఈరోజు మధ్యాహ్నం 12:03 గంటలకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌ బాబు వైరల్‌ గా మారింది.

vemulawada ramesh babu

“ఇక రాజకీయాలు ప్రజలకోసమే చేయాలి, పదవుల కోసం కాదు అని చెప్పిన మా తండ్రిగారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటు ఆపనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తానని నాతొ ఉన్నవారందరికి భరోసా ఇస్తున్నాను! దయచేసి నిర్నయాలు మా అందరితొ సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి, లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి, ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం” అంటూ వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌ బాబు పేర్కొన్నారు. అయితే.. వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌ బాబు మాటలు చూస్తుంటే.. ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ఆసక్తికరంగా లేరని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version