తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ పార్టీ

-

తెలంగాణలో తొలి సారిగా ఓ తమిళ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్‌ కట్చి (వీసీకే) పార్టీ తరఫున అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ నుంచి జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

హైదరాబాద్‌ లోక్‌సభకు పోటీ చేస్తున్న జె.పద్మజ ముషీరాబాద్‌లో ఉంటుండగా.. సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పగిడిపల్లి శ్యామ్‌ కుత్బుల్లాపూర్‌లోని సూరారం కాలనీలో ఉంటున్నారు. తమిళనాడులో బహుజనులు, దళితుల హక్కుల కోసం విడుతలై చిరుతైగల్‌ కట్చి నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. వీసీకే పార్టీ అధ్యక్షుడిగా తిరుమావలన్‌ కొనసాగుతున్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీతో వీసీకే పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా డీఎంకే అగ్రనేతలు వీసీకే పార్టీకి రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించగా.. మరోవైపు బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలిపినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version