IPL 2024: రిషభ్ పంత్‌పై నిషేధం?

-

రేపు కేకేఆర్ జట్టుతో ఆడే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ పంత్ ఇప్పటికే రెండుసార్లు జరిమానా చెల్లించాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో మరోసారి అదే తప్పు రిపీట్ అయింది.

Rishabh Pant On Brink Of IPL Match Ban For Code of Conduct Breach

ఈ నేపథ్యంలో పంత్‌ 30 లక్షల వరకు జరమానా తో పాటు తర్వాతి మ్యాచ్ కు వేటు పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రేపు కేకేఆర్ తో ఆడే మ్యాచ్ లో పంత్ ఉండబోడు అన్నమాట. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 256 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ కి ఓటమి ఎదురైంది. బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు. దీంతో 20ఓవర్లలో 247 రన్స్ కే పరిమితమైంది. తిలక్వర్మ(63 పరుగులు) పోరాడినా ప్రయోజనం లేకపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version