2027లో జమిలి ఎన్నికలు వస్తాయి…వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైసిపి కార్యకర్తలను కూటమి నేతలు గ్రామాల నుంచి తరిమేస్తున్నారు… గ్రామాల చివర్లో టెంట్ లు వేసుకుని వుండే భయానక వాతావరణం సృష్టించారని ఆగ్రహించారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని… కాకినాడ సీ పోర్టులో కేవి రావు ఎవరో తెలియకపోయినా నా పై కేసు పెట్టారని ఫైర్ అయ్యారు.
మేము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే 3 ,4 నెలలు జైల్లోకి వెళ్ళినా పోరాటం చేస్తామని… నా మీద లుక్ అవుట్ నోటీస్ ఎందుకు అంటూ నిలదీశారు. మీరు పిలిస్తే నేను సీఐడి ఆఫీస్ కు వస్తా.. అరెస్టు చేసుకోండి అంటూ తేల్చి చెప్పారు. బెయిల్ పిటిషన్ కూడా వేయను… భయపడేది లేదు. భయం వైసిపి నాయకులు రక్తంలో లేదని తెలిపారు. నేను విశాఖలో ఒక్క సెంట్ ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేయలేదని…. బంధువులు కోనుగోలు చేస్తే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.