BRS కాదు…భవిత రహిత సమితి అంటూ విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకులు విజయ శాంతి. భవిత రహిత సమితి (బీఆర్ఎస్) నేత కేటీఆర్ గారు….. రేవంత్ గారిని సీఎం గా ప్రకటించినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు 30 స్థానాలు కుడా వచ్చేవి కాదు అన్నారని గుర్తు చేశారు.
కానీ, ఆ ఎన్నికలల్ల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని సీఎం గా ప్రకటించి 64 స్థానాలు గెలవలే అంటూ సెటైర్లు కూడా పేల్చారు. ఐతే కేసీఆర్ గారు సీఎం అని ప్రకటించుకున్న బీఆర్ఎస్ 39 స్థానాల్లో మాత్రమే తెచ్చుకున్నదని చురకలు అంటించారు.
ఇక బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ ను గెలిపించారు ప్రజలు అంటున్నారు, అవును బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ ను గెలిపించిన్రరు, కాక బీఆర్ఎస్ పై అనుకూలతతో కాంగ్రెస్ ను గెలిపిస్తరా… అర్థం కావట్లేదు ఆ ప్రకటన ప్రజలకు అంటూ మండిపడ్డారు విజయ శాంతి.