ఇదేనా బంగారు తెలంగాణ అంటే ? – విజయశాంతి

-

ఇదేనా బంగారు తెలంగాణ అంటే ? అని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం ఫలితంగా మహబూబాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ కాలువల ఆనవాళ్లు కనిపించడం లేదు. కొన్ని యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతుంటే… మరికొన్ని మట్టితో పూడుకుపోయాయని… ఇరిగేషన్ ఆఫీసర్లు నిర్వహణను గాలికొదిలేయడంతో… నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహించారు. జిల్లాకు స్టేజ్–1లో డీబీఎం–48, స్టేజీ–2లో డీబీఎం 57, 59, 60, 61, 63 కాలువల ద్వారా ఎస్సారెస్పీ నీళ్లు అందుతుండగా.. ఆయా కెనాల్స్‌కు సంబంధించిన పిల్ల కాలువలన్నీ మూసుకుపోయాయని విమర్శలు చేశారు.

ఓ వైపు భూముల రేట్లు పెరిగిపోవడంతో రియల్టర్లు కాలువలను ఆక్రమించేస్తున్నరు. జిల్లాకు సాగు నీరు అందించాలని అప్పట్లో ఎస్సారెస్పీ పిల్ల కాలువలు నిర్మించారు. జిల్లాలో మొత్తం 15 మండలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలువలు కబ్జాకు గురికావడం, మట్టితో పూడుకుపోవడంతో ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా పోయాయి. దీంతో నీరు విడుదలైన సమయంలో ఆ నీళ్లన్నీ వృథాగా పోతున్నాయన్నారు.

ఆఫీసర్లకు ఈ విషయం తెలిసినా అసలు పట్టించుకోవడం లేదు. ఏం కేసీఆర్? ఇదేనా బంగారు తెలంగాణ అంటే? కేసీఆర్ సర్కార్ తీరు వల్ల ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా వాసులు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఈ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నం. అరాచకాలకు అడ్రస్‌గా మారిన కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ ప్రజానీకం త్వరలోనే గట్టి గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version